రిజిస్ట్రేషన్లు చేయం
కల్వకుర్తిలోని పలు ప్రాంతాల్లో పురపాలక అధికారుల అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తున్నారు. అక్కడ కొనుగోలు చేసిన వారు భవన నిర్మాణాల కోసం అధికారుల వద్దకు వెళ్తే ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆందోళనకు గురైన స్థలాల యజమానులు పట్టణ ప్రణాళిక అధికారులకు ఫిర్యాదు చేశారు.
పురపాలక చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి వెంచర్లు ఏర్పాటు చేసినా.. చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రణాళిక అధికారులు హెచ్చరించారు.
ఇవీ చూడండి:ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన హై'టెక్' మెట్రో