నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టీఎస్‌యూటీఎఫ్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. తొలుత స్థానిక పురపాలిక ఛైర్మన్ ఎడ్మ సత్యం, సీఐ సైదులు, టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తలసేమియాతో బాధపడే వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు తెలిపారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున పురపాలికలో పనిచేసే 90 మంది కార్మికులకు లక్ష రూపాయలతో నిత్యావసర సరుకులను కొనుగోలు చేసినట్లు వారు చెప్పారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు