నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో నూతనంగా ఎన్నికైన సహకార సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు సింగిల్ విండో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. అయితే కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్నికల అధికారులమంటూ... కార్యాలయంలోకి చొరబడి ఎన్నికల సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు కొంత సామగ్రిని ఎత్తుకెళ్లారని కాంగ్రెస్ వర్గీయులు ఆరోపించారు. దీనితో అక్కడ కాంగ్రెస్, తెరాస వర్గాల మధ్య తీవ్ర తోపులాటలు జరగగా... పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తోపులాటలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుడికన్నుకు గాయమైంది.
అనంతరం నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఓటమిని అంగీకరించని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆరోపించారు.
ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!