ETV Bharat / state

Telangana Government: 'డిండి ఎత్తిపోతల పథకం పనులను ఇక చేపట్టబోం' - డిండి ఎత్తిపోతల పథకం వార్తలు

Telangana Government ON Dindi Upliftment Scheme: డిండి ఎత్తిపోతల పథకం పనులను చేపట్టబోమంటూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కు హామీ ఇచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్‌ఎల్‌ఐఎస్‌) పనులను నిలిపివేస్తూ అక్టోబరు 29న ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో దానితో సంబంధం ఉన్న డిండి పనులు ఆపేసినట్టు పేర్కొంది.

Telangana Government ON Dindi Upliftment Scheme
డిండి ఎత్తిపోతల పథకం
author img

By

Published : Dec 23, 2021, 8:53 AM IST

Telangana Government ON Dindi Upliftment Scheme: పర్యావరణ అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డిలు వాదనలు వినిపిస్తూ పర్యావరణ అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడుతోందన్నారు. పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పనులు కొనసాగిస్తోందన్నారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశాక పీఆర్‌ఎల్‌ఐఎస్‌ పనులను ఆపాలంటూ ఇంజినీర్లకు లేఖ రాసినట్లు చెప్పారు. దాన్నుంచే డిండికి నీటి సరఫరా అవుతున్నందున దాన్నీ ఆపేశామన్నారు. జనవరి 6వ తేదీన పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు సంబంధించిన పిటిషన్‌ విచారణకు రానుందని, అదే తేదీకి డిండిపై పిటిషన్‌ను వాయిదా వేయాలని కోరారు. ధర్మాసనం అనుమతిస్తూ డిండి పనులను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డు చేస్తూ విచారణను జనవరి 6కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: భూములు తీసుకున్నారు సరే.. పరిహారం మాటేంటి మరి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.