తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో వేడుకలు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.
తెదేపాను 1982లో ఎన్టీఆర్ స్థాపించి.. 9నెలల్లోనే అధికారంలోకి వచ్చారని మండల అధ్యక్షుడు రామస్వామి గుర్తుచేసుకున్నారు. పేదలకు కూడు, గూడు కల్పించిన ఘనత తెదేపాదేనని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
![tdp anniversary celebrations, tdp anniversary at kollapur in nagarkurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11201513_tdp-1.png)
ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, బెమిని కురుమయ్య, నాని యాదవ్, ఆటో కురుమయ్య, వార్డు మెంబర్ అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలుగింటి ఆడపడుచు అరుదైన ఘనత.. రామసేతును ఈదిన రెండో మహిళ!