ETV Bharat / state

గిరిజన విద్యార్థినులకు వరం... సమ్మర్​ క్యాంపు - sumarai

వేసవి సందడి వచ్చేసింది. బడులకు టాటా చెప్పి కొందరు చుట్టాల ఇళ్లకు బస్సులెక్కుతుంటే మరి కొందరు ఈ సెలవుల్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు.  అలాంటి వారి కోసమే  రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సమ్మర్​ సమురాయ్​ క్యాంపు పేరుతో గిరిజన విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోంది. విద్యార్థినుల ఆశక్తికి అనుగుణంగా నృత్యం, నాటికలు, వకృత్వం తదతర వాటిలో శిక్షణనిస్తున్నారు. అంది వచ్చిన అవకాశంతో విద్యార్థినులు సంతోషంగా ఉన్నారు.

సమ్మర్​ క్యాంపులో విద్యార్థినుల సందడి
author img

By

Published : Apr 18, 2019, 3:11 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని కల్వకుర్తిలో గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినుల కోసం సమ్మర్​ సమురాయ్​ క్యాంపు ఫేస్​ 2 నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థినులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.

విద్యార్థినిలు ఉత్సాహం

పదిహేను రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో శిక్షకులతో విద్యార్థులకు నృత్యాలు నేర్పిస్తున్నారు. ఈ క్యాంప్​ తమకెంతో సంతోషాన్నిచ్చిందని విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్​ ఎస్​ ప్రవీణ్​కుమార్​ నేతృత్వంలోని గురుకుల పాఠశాలలు అన్ని రంగాల్లోనూ ముందున్నాయని గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్​ సావిత్రి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 300 మంది విద్యార్థినులకు పోషక విలువలతో కూడిన భోజన సౌకర్యంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సమ్మర్​ క్యాంపులో విద్యార్థినుల సందడి

ఇదీ చదవండి: శ్రీవారి రథం లాగిన త్రివిక్రమ్ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.