ETV Bharat / state

నీట మునిగిన పంపులు పైకి తేలాయి - నాగర్​కర్నూల్​ జిల్లా తాజా వార్తలు

కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో.. పంప్‌హౌస్‌లోకి నీరుచేరడంతో మునిగిన మోటార్లు పైకి తేలాయి. ఈ నెల 9వ తేదీన పెద్దశబ్దం వచ్చి.. పంప్‌హౌజ్‌లోకి నీరుచేరింది.

నీట మునిగిన పంపులు పైకి తేలాయి
నీట మునిగిన పంపులు పైకి తేలాయి
author img

By

Published : Oct 27, 2020, 5:24 AM IST

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కల్వకుర్తి ప్రాజెక్టు పంపుహౌస్​లో నీట మునిగిన పంపులు పైకి తేలాయి. ఈ నెల 9వ తేదీన పెద్దశబ్దం వచ్చి.. పంప్‌హౌజ్‌లోకి నీరుచేరింది. 70మీటర్లకు పైగా నీరు చేరడంతో....5మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి.

అప్పటి నుంచి 7 మోటార్లతో నీటిని ఎత్తిపోయగా... సోమవారం కేఎల్​ఐ మోటార్ల పైభాగం బయటపడింది. ఒకట్రెండు రోజుల్లో మొత్తం నీటిని ఎత్తిపోస్తామని అధికారులు తెలిపారు. గతంలోనూ ఓ సారి షట్టర్లు పగిలి పంప్‌హౌస్‌లోకి నీరు చేరగా... ఎత్తిపోసేందుకు నెల రోజులు పట్టింది. మోటార్లను పూర్తిగా ఆరబెట్టేందుకు నెలరోజులు పడుతుందన్న అధికారులు...మూడో మోటారు ఎక్కువగా దెబ్బతిని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: మీ తప్పు లేదని నిరూపించుకోండి: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.