ETV Bharat / state

శ్రీశైలం - హైదరాబాద్‌ ఎన్‌హెచ్‌ విస్తరణకు అభ్యంతరం? - telangana news

శ్రీశైలం - హైదరాబాద్‌ జాతీయ రహదారి విస్తరణ పనులకు అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాత్రికుల రద్దీ పెరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ చేసేందుకు జాతీయ రహదారి శాఖ.. అటవీశాఖ అధికారుల అనుమతి కోరింది. వన్యప్రాణుల ఉనికిపై ప్రభావం ఉండటంతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది.

srisailam-hyderabad-object-to-national-highway-expansion
శ్రీశైలం - హైదరాబాద్‌ ఎన్‌హెచ్‌ విస్తరణకు అభ్యంతరం?
author img

By

Published : Feb 11, 2021, 9:16 AM IST

765 నంబరు జాతీయ రహదారి నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నల్లమల పులుల అభయారణ్యంలో సుమారు 60 కిలోమీటర్లు జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. సాధారణంగా జాతీయ రహదారులు వంద అడుగుల వెడల్పుతో ఉంటాయి. నల్లమల అటవీ ప్రాంతంలో 24 అడుగులే ఉంది. శ్రీశైలం, నల్లమలలోని పుణ్యక్షేత్రాలు, పర్యటక ప్రాంతాలకు వచ్చే యాత్రికుల రద్దీ పెరగడంతో వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో 40 అడుగుల మేర రోడ్డు విస్తరణకు 48 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉండటంతో జాతీయ రహదారులశాఖ.. అటవీశాఖ అనుమతి కోరింది.

పులులు, ఇతర వన్యప్రాణుల ఉనికిపై ప్రభావం ఉంటుందని.. కాబట్టి అనుమతి ఇవ్వలేమని అటవీశాఖ అధికారులు తెలియజేయనున్నట్లు సమాచారం. రహదారి రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండటంతో నిబంధనల ప్రకారం ఆ శాఖ అనుమతి తప్పనిసరి. అటవీశాఖ అనుమతులు లేక పనులు చేయలేకపోతున్నామని జాతీయ రహదారుల డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కొల్లాపూర్‌, సోమశిల మీదుగా కొత్తగా జాతీయ రహదారి మంజూరైన నేపథ్యంలో ప్రస్తుతానికి శ్రీశైలం రోడ్డు విస్తరణ అవసరం లేదని నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్‌ అన్నారు.

ఇదీ చూడండి: 18న దేశవ్యాప్తంగా 'రైల్‌ రోకో'- రైతు సంఘాల పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.