నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలంలో రెండో రోజు రేవంత్‌రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ఉప్పునుంతల నుంచి డిండి చింతలపల్లి వరకు 10 కిలోమీటర్లు సాగనుంది.
సాగు చట్టాలను దేశంలోని రైతులందరూ వ్యతిరేకిస్తుంటే కేంద్ర ప్రభుత్వం తీవ్రవాద విధానాన్ని అవలంభిస్తోందని వెల్లడించారు. దీన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని అన్నారు. రైతులను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను ధ్వంసం చేసి.. ప్రజాసంపదను నాశనం చేస్తుందని ఆరోపించారు.
గత నెల 26న రైతులందరూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే.. వ్యూహాత్మకంగా వారిని దారితప్పించి ఇండియా గేట్ వద్ద దుష్ట శక్తులను మోహరించి ఎర్రకోటపై రైతులపై దాడి చేయించింది మోదీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ఐకేపీ, మార్కెట్ యార్డులు ఎత్తివేసే పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: దా'రుణ' యాప్‌లకు దూరంగా ఉండండి:ఆర్బీఐ