నాగర్కర్నూల్ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా విధులను బహిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ధర్నాలో వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. మృతి చెందిన విజయారెడ్డికి సంతాపం తెలిపారు. తహసీల్దార్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కారు తీసుకువచ్చిన కొత్త విధానం వల్లే ప్రజల మధ్య రెవెన్యూ శాఖపై నమ్మకం లేకుండా పోయిందని వాపోయారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్ చేస్తూ వ్యాజ్యం