రెండునెలల క్రితం అగ్నిప్రమాదానికి గురై దెబ్బతిన్న శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ఉత్పత్తిని పునరుద్ధరించారు. అక్కడి ఆరు యూనిట్లలో రెండింటిని పునరుద్ధరించారు. పాక్షికంగా దెబ్బతిన్న 1, 2 యూనిట్లలో పూజల తర్వాత... విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్విచ్చాన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
ఒక్కో యూనిట్ నుంచి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా దానిని గ్రిడ్‌కి అనుసంధానం చేశారు. మిగిలిన యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్న జగదీశ్‌రెడ్డి... ప్రమాదం జరిగిన నాలుగో యూనిట్‌లో పూర్తిగా పునరుద్ధరించడానికి ఏడాది పట్టే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్లాంట్ మరమ్మతులు వేగంగా పూర్తి చేసిన అధికారులను ఆయన అభినందించారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నాం: కేటీఆర్