నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు పరుస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో పలు చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ పట్టణంలోకి అనుమతించట్లేరు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా, బస్టాండు కూడలి, హౌసింగ్ బోర్డ్, చెరువు కట్ట, బస్ డిపోల వద్ద ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలాగే బిజినేపల్లి, తిమ్మాజీ పేట, తెలకపల్లి, తాడూరు శివార్లలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సడలింపు సమయం దాటాక బయటి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు పెడుతున్నారు. వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు