నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో ఓ వరాహం మాతృ ప్రేమను చాటుకుంది. లోకం తెలియని కుక్క పిల్లలు ఆకలిగా అటు ఇటు తిరుగుతుండగా.. తానే అమ్మై అక్కున చేర్చుకుని పాలిచ్చింది. కన్న తల్లిలాగా ఆదరించి అమ్మ ప్రేమకు జాతి లేదని లోకానికి చెప్పింది. ఈ దృశ్యం చూసిన గ్రామస్థులు మాతృత్వపు మమకారానికి ఫిదా అయ్యారు.
ఇదీ చూడండి: బంగ్లాదేశ్ మార్కెట్.... ఇక్కడ అన్ని చవకే!