నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతులు గిట్టుబాటు ధర కోసం రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు రైతులు తాము పండించిన వేరుశనగ పంటను అమ్మడానికి తీసుకువచ్చారు. ఎక్కువ మొత్తంలో వేరుశనగ పల్లీ మార్కెట్కు రావడం వల్ల మద్దతు ధర రూ. 6,969 ఉండగా వ్యాపారులు రూ. 500 నుంచి రూ. 1,000 తక్కువ చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఆగ్రహించిన రైతులు ధాన్యం నాణ్యతను బట్టి ధర నిర్ణయించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ కూడలిలో వేరుశనగ పల్లీలను రోడ్డుపై పోసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రెండు గంటల పాటు ఆందోళన కొనసాగగా వాహనాలు కిలోమీటర్ వరకు స్తంభించాయి. పోలీసులు వ్యవసాయ మార్కెట్ అధికారులతో మాట్లాడి రైతులను చర్చలకు పిలవగా ఆందోళన విరమించి వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి రైతులు తరలివెళ్లారు.
ఇదీ చూడండి : మళ్లీ కరోనా కలవరం.. పెరుగుతోన్న రోజువారీ బాధితులు