ETV Bharat / state

భద్రత మధ్య పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సర్వే - Palamuru - Rangareddy Upliftment Scheme News

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశకు అదనంగా కావాల్సిన భూమి కోసం పోలీసు భద్రత మధ్య అధికారులు భూ సర్వే నిర్వహించారు. 50 ఎకరాల భూమిని ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో ఈ విధంగా సర్వే నిర్వహించామని అధికారులు తెలిపారు.

Palamuru - Rangareddy Upliftment Scheme
పోలీసు భద్రత మధ్య భూ సర్వే
author img

By

Published : Apr 9, 2021, 8:50 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా ఎల్లూరు గ్రామంలో నిర్మిస్తోన్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్​-1కు అదనంగా కావాల్సిన 50 ఎకరాల భూమికోసం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు భూ సర్వే నిర్వహించారు. భూములను ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో పోలీసులను పిలిపించాల్సివచ్చిందని అధికారులు తెలిపారు.

జిల్లాలోని ఎల్లూరు గ్రామం వద్ద నిర్మిస్తోన్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ కోసం అదనంగా 50 ఎకరాల భూమి అవసరం ఉంది. భూములను ఇవ్వాలని రైతులను అధికారులు కోరగా అందుకు వారు నిరాకరించారు. ఈ క్రమంలో అధికారులు భారీగా పోలీసులను బలగాలను రప్పించి భూ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న కొందరు రైతులను పోలీసులు స్టేషన్​కు తరలించారు.

గతంలో కేఎల్ఐ ప్రాజెక్టుకు, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు, మరికొంత భూమి పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇచ్చామని రైతులు తెలిపారు. ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ ఆ భూములు కావాలని అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని... ఇప్పుడు తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పుష్కరఘాట్​ వద్ద రక్షణ చర్యలు చేపట్టిన సర్పంచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.