నాగర్ కర్నూల్ జిల్లాలోని నిన్న ఒక్క రోజులోనే తాళాలు వేసి ఉన్న 8 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లలో దాదాపుగా 13తులాల బంగారం, 25 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.
అందరూ ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఎంత సొమ్ము పోయిందన్న విషయం తేలాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?