old couple died after house collapse: నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం చెందారు. తెలకపల్లిలో నివాసముంటున్న భోగారాజు భద్రయ్య (65), భోగరాజు వెంకటమ్మ (60) వృద్ధ దంపతులు రోజు మాదిరిగానే భోజనం చేసి ముందు గదిలో పడుకున్నారు. అయితే సాయంత్రం నుంచి వర్షం కురవడంతో మట్టి మిద్దె పూర్తిగా తడిచింది. మధ్య రాత్రి 12 గంటలకు గది పూర్తిగా తెగి కుప్ప కూలి వృద్ధ దంపతులపై పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
త్రుటిలో తప్పించుకున్న మనవళ్లు: మధ్య రాత్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులతో కలిసి మట్టిని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుగా విలపించారు. కుమారుడు, కోడలు మరో గదిలో పడుకోవడం... మనువళ్లు ఇద్దరు వినాయక విగ్రహం దగ్గరికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.
కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన: గత నెలలో నిరంతరం కురిసిన తుపాన్ ప్రభావానికి మట్టి మిద్దెలు తడిసి ముద్దాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్... ప్రజలకు మట్టి ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తక్షణమే మట్టి ఇల్లు, పాత ఇల్లు ఖాళీ చేసి మరో ఇళ్లకు మారాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తమై ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు.
ఇవీ చదవండి: