ETV Bharat / state

స్కూల్​ ముందు క్షుద్ర పూజలు.. భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు

Occult worship in front of school in Nagar Kurnool: మోడల్ స్కూల్ ఎదుట క్షుద్ర పూజలు కలకలం సృష్టించింది. పాఠశాల గేటు ముందు, విద్యార్థుల హాస్టల్​లో సున్నంతో ముగ్గులు వేసి పూజలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళన చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.

puja
puja
author img

By

Published : Feb 7, 2023, 7:21 PM IST

Occult worship in front of school in Nagar Kurnool: క్షుద్ర పూజలు ఎక్కడ చేసినట్లు తెలిసిన అక్కడ ఉన్న ప్రజలు అందరూ చాలా భయపడతారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా పిల్లలు చదువుకుంటున్న పాఠశాల ముందే ఈ పూజలు నిర్వహించారు. పోలీసులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలోని కోడెర్ మండల కేంద్రంలో ఊరగట్టున ఉన్న మోడల్​ స్కూల్ ఎదుట, హాస్టల్​లో క్షుద్ర పూజల కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి గేట్ ముందు, హాస్టల్​లో, గోడ పక్కన సున్నంతో ముగ్గు వేసి పూజలు చేసిన ఆనవాళ్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

మోడల్​ స్కూల్ ప్రధాన గేటు, వెనకాల ఉన్న బాలికల వసతి గృహం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు సున్నంతో చుట్టూ గీసి అందులో కొబ్బరికాయ, ఇనుప మేకు, జిల్లేడు ఆకులు, జీడిగింజలు, నిమ్మకాయలు పెట్టి పసుపు, కుంకుమ వేశారు. ఉదయం వసతి గృహంలో ఉంటున్న బాలికలు అవి చూసి భయాందోళన చెందారు. దీంతో వెంటనే హాస్టల్ ఇంచార్జ్ నాగమణి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి వాటిని తొలగించారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదని.. మనోధైర్యంతో ఉండాలని పోలీసులు వారికి చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.