ETV Bharat / state

'అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి' - కరోనాపై కలెక్టర్​ శ్రీధర్ అవగాహన

ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలని నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ సూచించారు. అత్యవసర పరిస్థితిలుంటేనే బయటకు రావాలని జిల్లా వాసులకు తెలిపారు.

Nagarkurnool district collector sridhar awareness on corona virus
'అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి'
author img

By

Published : Mar 20, 2020, 7:59 PM IST

'అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి'

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో నాగర్​ కర్నూల్​ జిల్లా ప్రజలకు కలెక్టర్​ అవగాహన కల్పించారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 14 రోజుల వరకు గృహనిర్బంధంలో ఉండాలని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. శానిటైజర్లు వినియోగించాలని, మాస్కులు ధరించి కరోనా వైరస్​ దరిచేరకుండా జాగ్రత్తపడాలని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.