నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి... పరీక్షలలో పొందుతున్న గ్రేడ్లను గురించి అడిగి తెలుసుకున్నారు.
వారాంతపు పరీక్షలలో విద్యార్థుల ఉత్తీర్ణతను పరిశీలించారు. పాస్ కానీ విద్యార్థుల శాతంలో మార్పు లేకపోవడంపై సంబంధిత సబ్జెక్టు టీచర్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై విద్యార్థులు ఉత్తీర్ణత ఇలాగే కొనసాగితే సంబంధిత సబ్జెక్టు టీచర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం వంటగదిని, పాఠశాల పరిసరాలను ఆయన తనిఖీ చేశారు. వంటగది, స్టోర్ రూమ్ శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: విమానాశ్రయంలో 'ఎలుగుబంటి' డ్యూటీ!