ఈనెల 15లోగా పల్లె ప్రకృతి వనాల పనులను పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మాన్ చౌహన్ ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
డంపింగ్ యార్డులు, కంపోస్టు ఎరువులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదిక నిర్మాణాల పనుల పురోగతిపై సమీక్షించారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నాణ్యంగా చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.