నాగర్ కర్నూల్ కలెక్టర్ యాస్మిన్ బాష హరితహారం అమలు చేస్తున్న తీరు గురించి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించిన మొక్కలు నాటి లక్ష్యాన్ని చేరుకోవాలని.. అలసత్వం ప్రదర్శించి.. మొక్కలు నాటడంలో విఫలమైతే.. చర్యలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించారు. హరితహారం ప్రారంభమై పది రోజులు పూర్తయినా.. మొక్కల కోసం తీసిన గుంతలు అలాగే ఉన్నాయని, ఇంకా మొక్కలు నాటకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మొక్కలు నాటడం లేదని కలెక్టర్ అధికారులను నిలదీశారు.
జిల్లాలో ఏ శాఖకు ఎన్ని మొక్కలు నిర్దేశించారో.. ఆ లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని హెచ్చరించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డు, తడి, పొడి చెత్త వేసే ప్రదేశాలు, స్మశాన వాటికలు, ట్రాక్టర్లు, ట్యాంకర్ల కొనుగోలు, రైతు వేదికల నిర్మాణాల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్