నాగర్కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి, పెద్దకర్పాముల, లింగాల, కొల్లాపూర్, బిజినేపల్లి మండలాలకు చెందిన మొత్తం 29 మంది కూలీలను హనుమానాయక్, ఈశ్వరయ్య అనే లేబర్ కాంట్రాక్టర్ కర్ణాటక ప్రాంతానికి వలస తీసుకెళ్లారు. అక్కడ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద వారిని వదిలేసి... కాంట్రాక్టర్ మామూలు కమిషన్ తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి యాజమాన్యం కూలీలకు సరైన డబ్బులు ఇవ్వకుండా... ఒప్పందం గడువు దాటినా వారిని వెళ్లనివ్వకుండా అక్కడే ఉంచేశారని కూలీలు వాపోయారు. వీరంతా అనారోగ్యం పాలయ్యారనే విషయం తెలుసుకున్న గ్రామస్థులు నేషనల్ ఆదివాసి కౌన్సిల్ సభ్యులు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర అధికారుల సహకారంతో వారిని విడిపించి... నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సమక్షంలో హాజరు పర్చారు.
కూలీలు అంతా... కలెక్టర్ వద్దకు చేరుకుని తమ గోడును విన్నవించుకున్నారు. లేబర్ కాంట్రాక్టర్ హనుమానాయక్, ఈశ్వరయ్య తమ పేరుపై కంపెనీల వద్ద డబ్బులు తీసుకుని తమకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 2ఎకరాల నుంచి 170ఎకరాలు... కేసీఆర్ మెచ్చిన సాగు ధీరుడు