ETV Bharat / state

అపరిశుభ్ర పరిసరాల మధ్య నాగర్​ కర్నూల్​ కలెక్టరేట్​

ఇంటిని శుభ్రంగా ఉంచుకో... తర్వాత ఊరి శుభ్రం గురించి ఆలోచించు అనేది అందరూ చెప్పుకొచ్చేవే... కానీ ఆచరణలో మాత్రం చేసి చూపరు కొందరు. ఆదర్శంగా ఉండాల్సిన కలెక్టరేట్​ పరిసరాలు అపరిశుభ్రానికి అడ్డాగా ఉంది. చెత్తంటే ఇంతలా ఉంటుందా... ఇది కలెక్టరేటేనా అని అనుమానం రేకెత్తించేలా ఉన్న నాగర్​ కర్నూల్​ కలెక్టరేట్​ పరిసరాలపై ఈటీవీ భారత్​ పరిశీలనాత్మక కథనం.

collectorate premises, a copy of dump yard
అపరిశుభ్ర పరిసరాల మధ్య నాగర్​ కర్నూల్​ కలెక్టరేట్​
author img

By

Published : Mar 4, 2020, 8:55 PM IST

అపరిశుభ్ర పరిసరాల మధ్య నాగర్​ కర్నూల్​ కలెక్టరేట్​

'కాలనీ శుభ్రంగా ఉండాలి, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలంటే మనం చెత్త బయట పడేయకూడదు' పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ అన్న మాటలివి. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్య కలెక్టరేట్​ వద్దే మొదలైంది.

అపరిశుభ్రతకు కేరాఫ్...

పట్టణ ప్రగతిలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఆదేశం నాగర్ కర్నూల్ కలెక్టరేట్​కు వర్తించినట్లుగా లేదు. జిల్లా అధికారులుండే కలెక్టరేట్ ఇంత అపరిశుభ్రమా అనిపిస్తుంది. ఊరి బాగుండాలంటే చెత్త వేయొద్దని చెబుతున్న అధికారులు తమ కార్యాలయ పరిసరాలను కనీసం చూడడం లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈటీవీ భారత్ కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే చుట్టూ అపరిశుభ్రానికి కేరాఫ్​గా కనిపించాయి అక్కడి ప్రదేశాలు.

ఎక్కడపడితే అక్కడ తాగిపడేసిన నీళ్ల సీసాలు, టీ గ్లాసులు

కార్యాలయం కిటికీ నుంచి తాగి పడేసిన టీ గ్లాసులు, వాటర్ బాటిళ్లు, పార్సిల్ కవర్లు, కాగితాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత చెత్త ఒకే చోటా..! అనిపించకమానదు. కలెక్టరేట్​ వెనుక భాగంలోని మిషన్ భగీరథ కార్యాలయం వెనుక చెత్తతో నిండిపోయింది. కలెక్టరేట్​కు సప్లై చేసే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ముళ్ల కంపలు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళితే అక్కడ అ మూలన మలమూత్రాలు విసర్జిస్తున్నారు.

దుమ్ముతో నిండిన రిఫ్రిజిరేటర్లు

ఇక కలెక్టరేట్ లోపలికి వెళితే వచ్చిపోయే వారికోసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. రెండు రిఫ్రిజిరేటర్లలో ఒకదానిలోనే నీళ్లున్నాయి. రెండూ రిఫ్రిజిరేటర్లు దుమ్ము ధూళితో నిండిపోయాయి. తాగే గ్లాసులు శుభ్రంగా లేవు అసలు ఎప్పుడూ కలిగినట్లుగా కూడా లేవు.

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన కలెక్టరేట్​ పరిసరాలు ఇంత అధ్వానంగా ఉంటే పట్టణం ఎలా ఉంటుందో అని కొత్తగా వచ్చిన వారికి అనుమానంరాక తప్పదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలెక్టరేట్​ పరిసరాలను పరిశుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: కరోనా ఎలా సోకుతుంది... దానిని ఎలా కట్టడి చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.