నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ చౌహన్ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజావాణిని వాట్సప్ ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టరేట్ భవనంలో ప్రజావాణి వెబ్సైట్ ప్రారూంభించారు. ఆన్లైన్లో, వాట్సాప్లో వచ్చిన ఫిర్యాదులను ఆయన పరిశీలించి.. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
వివిధ మండలల పరిధిలోని గ్రామాల నుంచి జిల్లా కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇకపై కార్యాలయాలకు రాకుండా.. ఆన్లైన్లో మీ సమస్యను చెప్తే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. కరోనా వ్యాపించకుండా తీసుకున్న ఈ నిర్ణయం అందరి సహకారంతోనే విజయవంతమవుతుందని, ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ విధానం వల్ల అటు ప్రజలు, ఇటు వివిధ శాఖల అధికారులకు కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఉండదన్నారు.
బాధితులు ఫిర్యాదులను స్పష్టంగా రాసి వాట్సాప్ ద్వారా 9100904717 నెంబరుకు తెలియజేయవచ్చని, ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఫిర్యాదులను పంపవచ్చన్నారు. తమ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వాట్సాప్ నెంబర్లకే అప్లై చేయాలన్నారు. ఏ రోజు ఫిర్యాదులను ఆ రోజే ఆయా శాఖకు పంపి పరిష్కారిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుడి మొబైల్ నెంబర్కు సమస్య పరిష్కారం గురించి ఆయా శాఖల అధికారులు సమాచారం చేరవేస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుండి ఇప్పటి వరకు వివిధ సమస్యలపై 53 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపించామని, ఫిర్యాదులపై సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి : పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు