నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అభ్యర్థుల ముందు అధికారులు బ్యాలెట్ బాక్సులు సీల్ వేశారు. అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 24 వార్డులకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రికి అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు