ETV Bharat / state

అందుకే బాధితులను పరామర్శించనీయడం లేదు: రేవంత్​ - revanth reddy allegations on srisailam incident

శ్రీశైలం ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా రేవంత్​రెడ్డి ఆరోపించారు. ప్రమాదంపై ప్రతిపక్షాలు ఎక్కడ పోరాడతాయోననే ఉద్దేశంతోనే బాధితులను పరామర్శించకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. దుర్ఘటనపై సీబీఐ విచారణ కోసం పార్లమెంట్​లో గళమెత్తుతామని స్పష్టం చేశారు.

mp revanth allegations on kcr government over srisailam fire accident
అందుకే బాధితులను పరామర్శించనీయడం లేదు: రేవంత్​అందుకే బాధితులను పరామర్శించనీయడం లేదు: రేవంత్​
author img

By

Published : Aug 22, 2020, 10:45 PM IST

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్​ కేంద్రంలో జగిరిన అగ్నిప్రమాద ఘటన మానవ తప్పిదమేనని ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. దుర్ఘటనపై సీబీఐ విచారణ కోసం పార్లమెంట్​లో గళమెత్తుతామని స్పష్టం చేశారు.

శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్​రెడ్డి, మల్లు రవిని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి లత్తిపూర్​ పెట్రోల్​ బంక్​ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉప్పునుంతల పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో రేవంత్​రెడ్డి, మల్లు రవిని హైదరాబాద్​కు తరలించారు.

శ్రీశైలం ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న రేవంత్​.. ప్రమాదంపై ప్రతిపక్షాలు ఎక్కడ పోరాడతాయోననే ఉద్దేశంతోనే కనీసం పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఘటనపై గవర్నర్​ తమిళిసైకి లేఖ రాశామని తెలిపారు. ఘటనను ప్రధానమంత్రి కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శులకు వివరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే విచారణ జరిపించాలని కోరతామన్నారు. ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలకు డిమాండ్​ చేశారు.

అందుకే బాధితులను పరామర్శించనీయడం లేదు: రేవంత్​

ఇవీచూడండి: శ్రీశైలం అగ్నిప్రమాదస్థలికి వెళ్తుండగా రేవంత్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.