కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. పదరా మండల కేంద్రంలోని నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన దుప్పి.. దాహంతో స్థానిక పంట పొలాలకు వచ్చింది. అక్కడే ఉన్న కుక్కలు.. దుప్పిపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచాయి.
స్థానిక రైతుల సమాచారంతో.. అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని, దుప్పిని పశు వైద్యశాలకు తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ దుప్పి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అధికారులు.. దుప్పికి దహన సంస్కారాలు నిర్వహించారు. వన్య ప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: అపస్మారక స్థితిలో యువతి... పోలీసు స్టేషన్కు సమీపంలో ఘటన!