నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కరోనా బాధితుల అవసరార్థం కేజీబీవీ పాఠశాలలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ శర్మన్లు పరిశీలించారు. అనంతరం పెంట్లవెల్లిలో నిర్వహిస్తున్న ఇంటింటికీ జ్వర సర్వే గురించి ఆశా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.
కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సమస్యల గురించి వైద్యులతో చర్చించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. ప్రజలందరూ కరోనా కట్టడి కోసం పోలీసులు, వైద్యులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని తెలిపారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు