ETV Bharat / state

'ఎత్తిపోతలతో అచ్చంపేటను.. మరో సిద్దిపేటలా మారుస్తా' - బస్తీ బాట కార్యక్రమం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పర్యటించారు. 13వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో.. ఇళ్లు, రోడ్లు, తాగునీరు సమస్యలను పూర్తి స్థాయిలో తీరుస్తామని హామీ ఇచ్చారు.

Basti Bata in achampet
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
author img

By

Published : Apr 12, 2021, 8:37 PM IST

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. 'బస్తీ బాట' కార్యక్రమం చేపట్టారు. అచ్చంపేటలోని 13వ వార్డులో.. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో.. రూ. 17 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులను చేపట్టబోతున్నట్లు స్థానికులకు తెలిపారు. ఆయా పనులకు ఈ నెల 14న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందేలా కృషి చేస్తానని స్థానికులకు గువ్వల బాలరాజు హామీ ఇచ్చారు. పట్టణంలో.. ఇళ్లు, రోడ్ల సమస్యలను పూర్తి స్థాయిలో తీరుస్తామన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా.. లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. అచ్చంపేటను.. మరో సిద్దిపేటగా మారుస్తానని వివరించారు. రిజర్వాయర్​ పనులకు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి.. ఏడాది లోపు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.