నాగర్ కర్నూల్ జిల్లా లింగాల పరిధిలోని నల్లమల అడవుల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసీ చెంచుల ఆరాధ్యదైవమైన భౌరపూర్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవానికి కలెక్టర్ యల్.శర్మన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుటుంబసమేతంగా హాజరయ్యారు.
ఆదివాసీ చెంచుల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం.. ఈ వేడుక జరిగింది. తప్పెట్లు, మేళ తాళాల నడుమ.. చెంచులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా దేవతా మూర్తులను తీసుకొచ్చి కల్యాణం జరిపారు.
ఏటా ఈ మహోత్సవంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చెంచులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. చెంచులు.. పాడిపంటలు, ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు చల్లగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్లు కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. వారి అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు