నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని నెల్లికొండ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తెలంగాణ మార్కెట్ వారి ఆధ్వర్యంలో... కందుల కొనుగోలు కేంద్రాన్ని జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.
కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రాలకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు కందులు ఇంటి వద్దే ఆరబెట్టుకుని వస్తే సరైన మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళమెత్తండి'