తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఎన్నింటినో తీసుకోచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నిక ముందు తెరాసను ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున విమర్శించినప్పటికీ ఓటర్లు కారు గుర్తుకే ఓటేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడే పథకాలను ప్రజలు పరిశీలిస్తూనే తెరాసకు పట్టం కడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు వాస్తవాలు గమనిస్తారని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ ఢంకా మోగించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెరాసదే విజయం: తలసాని
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగిస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఎన్నింటినో తీసుకోచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నిక ముందు తెరాసను ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున విమర్శించినప్పటికీ ఓటర్లు కారు గుర్తుకే ఓటేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడే పథకాలను ప్రజలు పరిశీలిస్తూనే తెరాసకు పట్టం కడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు వాస్తవాలు గమనిస్తారని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ ఢంకా మోగించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Body:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేపథకాలను తీసుకోచిందని అందులో భాగంగానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి , వృద్దులకు ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా వంటిసంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజలలో ఎంతో ఆదరణ సంపాదించుకున్నారు అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు గెలుపొందిన తెరాసను ఎన్నికల్లో పోటీకి ముందు ప్రతిపక్ష పార్టీలు ఎంతగానో విమర్శించాయి అని అఖండ విజయం సాధించి ప్రజలు తెరాస వైపే ఉన్నారని నిరూపించారని ఆయన ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడే పథకాలను తీసుకువచ్చారని, వాటిని ఎప్పటికప్పుడు ప్రజలు పరిశీలిస్తూనే ఉన్నారని ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు నమ్మరని వాస్తవాలను గమనించుకుని వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాలను తీసుకు వచ్చారని వాటి ద్వారా కాలం చెల్లిన చట్టాలను తీసివేసి ప్రస్తుతం అవసరమయ్యే చట్టాలను మాత్రమే తీసుకొచ్చారని, ప్రజలకు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే విధంగా ఈ చట్టాల రూపకల్పన చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ ఢంకా మోగిస్తోంది ఆశాభావం వ్యక్తం చేశారు.
Conclusion:హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తెరాస పార్టీని పనిగట్టుకుని విమర్శించిన పార్టీలు, నాయకులు తెరాస గెలుపు తర్వాత తోకముడుచుకున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, భాజపా నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వంపై పనిగట్టుకొని చేసే విమర్శలను మానుకోవాలని హితవు పలికారు.
నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481