నియంత్రిత వ్యవసాయమే లాభదాయకమని, సాంప్రదాయక పద్ధతులతో రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని 99 సర్వే నెంబర్ లో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే నియంత్రిత వ్యవసాయ విధానంలో ముందున్నాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శర్మన్ చౌహన్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బాలాజీ సింగ్, కల్వకుర్తి పుర పాలక సంఘం ఛైర్మన్ సత్యం రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.