ETV Bharat / state

కల్వకుర్తిలో ట్రక్కు ఢీకొని కృష్ణా జిల్లా వాసి మృతి - కల్వకుర్తి తాజా వార్తలు

ట్రక్కు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలో చోటు చేసుకుంది. ఏపీకి చెందిన వెంకటేశ్వర్లు సొంతూరుకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా ట్రక్కు ఢీకొంది. వాహనం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కల్వకుర్తిలో ట్రక్కు ఢీకొని కృష్ణా జిల్లా వాసి మృతి

author img

By

Published : Jul 9, 2020, 9:55 AM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని జేపీ నగర్‌ వద్ద ట్రక్కు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏపీ కృష్ణా జిల్లా నందిగామ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (35) వాసవి నగర్‌లో నివాసం ఉంటూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

వెంకటేశ్వర్లు.. తన పెదనాన్న కుమారుడు శివతో పాటు కృష్ణా జిల్లా నందిగామ వెళ్లడానికి కల్వకుర్తి నుంచి ఆటోలో బయల్దేరాడు. జేపీ నగర్ వద్ద దిగి రోడ్డు దాటుతుండగా.. దేవరకొండ వైపు వస్తున్న ట్రక్కు ఢీకొంది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ట్రక్కును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.