ETV Bharat / state

పంపు హౌస్​ను క్షేత్రస్థాయిలో సందర్శించిన అధికారులు - కేఎల్​ఐ పంపు హౌస్​ను పర్యటించిన అధికారులు

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నిర్మించిన కేఎల్​ఐ పంపు హౌస్​ ప్రాజెక్టును కృష్ణా యజమాన్య బోర్డు అధికారులు, సీడబ్ల్యూసీ ఇంజినీరింగ్ సిబ్బంది సందర్శించారు.

kli pump house visiting the Officers at nagar kurnool district
పంపు హౌస్​ను క్షేత్రస్థాయిలో సందర్శించిన అధికారులు
author img

By

Published : Dec 5, 2020, 11:37 AM IST

నాగర్ కర్నూల్​ జిల్లా ఎల్లూరు వద్ద నిర్మించిన కేఎల్​ఐ పంపు హౌస్​ను కృష్ణా బోర్డు అధికారులు సందర్శించారు. అక్టోబర్ 16న నీటమునిగిన ఎల్లూరు పంప్​హౌస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంప్ హౌస్​లోకి నీరు చేరడం, మునిగి పోవడం తదితర వాటిని గమనించారు. ఎత్తిపోతల సలహాదారుడు పెంటారెడ్డి, కేఎల్ఐసీ.అంజయ్య పంప్ హౌస్ మునిగిపోయిన విషయాలు, సాంకేతిక సమస్యలను వారికి వివరించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని అప్రోచ్ ఛానల్, సొరంగం పనులను వారు పరిశీలించారు. బృందంలో కృష్ణ యజమాన్య బోర్డు సీఈఎంకీ శ్రీనివాస్, సభ్యులు మౌతంగ్, రాయి పూరె, సీడబ్ల్యూసీ డైరెక్టర్ దర్పన్ తల్వార్​, ప్రాజెక్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.