ETV Bharat / state

'పొలాలు బీడుబారాయ్​.. మాకు సాగునీరివ్వండి' - మాజీ ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ

పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా.. వినియోగించుకోలేని దురదృష్టవంతులమంటూ నాగర్​ కర్నూల్​ జిల్లాలోని పలు మండలాల రైతులు వాపోయారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జల సాధన కమిటీ రైతులు సాగునీటి కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

jala sadhana Committee farmers protest for water in nagar karnool balmoor
'పొలాలు బీడుబారాయ్​.. మాకు సాగునీరివ్వండి'
author img

By

Published : Mar 11, 2020, 8:00 PM IST

కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నా..ఆ నీటిని వినియోగించుకోలేక పోతున్నామంటూ నాగర్​ కర్నూల్​ జిల్లా బల్మూర్​ మండల రైతులు వాపోతున్నారు. మండల కేంద్రంలో సాగునీటి కోసం జలసాధన కమిటీ రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్​ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ దీక్షకు దిగారు.

తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 ఏళ్లు గడుస్తున్నా జిల్లాలోని పలు మండలాల్లో నీటి సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బల్మూర్​, లింగాల, అమ్రాబాద్​ మండలాల్లోని పొలాలు బీడుభూములుగా మారాయని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ మూడు మండలాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్​ వంశీకృష్ణ డిమాండ్​ చేశారు.

ఒక రిజర్వాయర్​ కట్టి నీటిని ఇటుగా మళ్లిస్తే తమ సమస్యలు తీరుతాయంటున్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తానని ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పుడు వారి వంక కన్నెత్తి కూడా చూడడంలేదని ఆయన ఆరోపించారు.

'పొలాలు బీడుబారాయ్​.. మాకు సాగునీరివ్వండి'

ఇదీ చూడండి: నల్గొండలో తలదాచుకున్న ఏపీ తెదేపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.