నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఫలితంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో కొన్నిచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. మరికొన్ని చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి.
పెంట్లవెళ్లి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి మండలాల్లో చెరువులు, వాగులు నిండి జలకళ సంతరించుకున్నాయి. వర్షం ధాటికి వీపనగండ్ల మండల కేంద్రంలో ఓ ఇల్లు కూలిపోయింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.
పెంట్లవెళ్లి చెరువు నిండి రోడ్డుపైకి నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొల్లాపూర్లో చుక్కాయిపల్లి చెరువు నిండి అలుగు పారుతోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు అలుగు పారుతున్న చెరువుల్లో కొందరు చేపలు పడుతూ కాలక్షేపం చేశారు.
ఇదీచూడండి: ఉరకలెత్తుతున్న కృష్ణా నది.. జూరాలకు భారీగా పెరిగిన వరద