నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరిగి వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు.
పథకాలు అందని వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏవిధంగా ఉన్నాయో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. తెరాస ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటుందని.. పట్టణ అభివృద్ధి తమతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
వచ్చే పురఎన్నికల్లో తెరాసను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కిషోర బాలికలు, బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లల పోషణలో అంగన్వాడీల పాత్ర కీలకమని కొనియాడారు. వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు.
ఇదీ చూడండి : మలిదశ మమతానుబంధం