శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన 9 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. దట్టమైన పొగల కారణంగా సహాయక బృందాలు లోపలికి వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. అగ్నిప్రమాద ఘటన వివరాలు సీఎం కేసీఆర్‌కు తెలియజేశామని చెప్పారు.
లోపల చిక్కుకున్న వారిలో ఏడుగురు జెన్‌కో సిబ్బంది, ఇద్దరు అమర్‌రాజా కంపెనీ సిబ్బంది ఉన్నారు. వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావడమే మా ప్రథమ కర్తవ్యం. మూడు అగ్నిమాపక యంత్రాలతో నీరు చల్లుకుంటూ సహాయక సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. మూడు మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
- ప్రభాకర్‌రావు
ఇదీ చదవండి: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 9 మంది