నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలో మరోసారి మంటలు చెలరేగాయి. మండలంలోని తుర్కపల్లి సెక్షన్ పరిధిలో ఈర్లపడేలు, రోళ్లబండ ప్రాంతంలో సాయంత్రం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
సుమారుగా పది హెక్టార్ల విస్తీర్ణంలో అడవి అగ్నికి ఆహుతైంది. ఇరవై మంది అటవీశాఖ సిబ్బందితో కలిసి రాత్రి 8గంటల వరకు మంటలను అదుపులోకి తెచ్చామని అమ్రాబాద్ అటవీ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు.
![నల్లమలలో చెలరేగిన మంటలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-13-18-nallamala-mantalu-avb-ts10153_19032021224523_1903f_1616174123_873.jpg)
ఇదీ చూడండి : 82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్