ETV Bharat / state

'భూములు లాక్కొని మా పొట్ట కొట్టొద్దు' - farmers who are going to loose thier land for palamuru rangareddy project are protesting at nagarkarnool district

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువలో భాగంగా భూములు కోల్పోతున్న వారు తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని కోరుతూ నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నా చేపట్టారు.

'భూములు లాక్కొని మా పొట్ట కొట్టొద్దు'
author img

By

Published : Sep 7, 2019, 7:34 PM IST

'భూములు లాక్కొని మా పొట్ట కొట్టొద్దు'

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్రధాన కాలువ వల్ల భూములు కోల్పోతున్న వారు తమ భూముల్ని బలవంతంగా లాక్కోవద్దని కోరుతూ నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఇప్పటికే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ ప్రాజెక్టులో తమ భూములు కోల్పోయామని వాపోయారు. ఇప్పుడు కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో 130 మంది రైతులకు చెందిన 270 ఎకరాల భూములను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువ కోసం తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉన్న అర, ఒక ఎకరం కూడా కోల్పోయి వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కొని పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. డీఆర్​ఓ మధుసూదన్​ నాయక్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.