ETV Bharat / state

'పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం' - Farmers raised concerns against the Umamaheswara Reservoir, nagar kurnool

నాగర్ కర్నూల్ జిల్లాలో తలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్​ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నిర్మాణం వలన చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

nagar kurnool district updates
ఉమామహేశ్వర రిజర్వాయర్, నాగర్ కర్నూల్
author img

By

Published : Mar 31, 2021, 7:56 PM IST

అచ్చంపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్​ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలోని రైతులు రిజర్వాయర్ మాకొద్దు... మా భూములను లాక్కోవద్దు అంటూ రోడ్డు పై బైఠాయించారు.

బల్మూర్ మండలం మైలారంలో రిజర్వాయర్ నిర్మించడం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం వలన సుమారు 250 కుటుంబాలు రోడ్డున పడతాయని.. 1850 ఎకరాలు నీట మునుగుతాయని తెలిపారు. ఈ విషయమై గతంలో మంత్రి హరీష్ రావు.. దురువాసుల చెరువుకు నీటిని పంపి చంద్రసాగర్ అప్పర్ ప్లాంట్​కు సాగునీరు పంపేలా చేస్తామని హమీ ఇచ్చారన్నారు. దీనివలన రైతులు తక్కువగా నష్టపోతారని వివరించారు. ఎక్కువ వ్యయంతో కూడి రైతులకు నష్టం కలిగించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టొద్దని కోరారు. ప్రభుత్వం విరమించుకోకుండా వారి భూములను ముంపుకు గురి చేస్తే.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు

ఇదీ చదవండి: 'మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.