ETV Bharat / state

20 టన్నుల నల్లబెల్లం పట్టివేత

అచ్చంపేటలో అక్రమంగా రవాణా చేస్తున్న 20 టన్నుల నల్లబెల్లాన్ని ఎక్సెజ్​ అధికారులు పట్టుకున్నారు. ఈ బెల్లం రవాణాకు సంబంధం ఉన్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

author img

By

Published : Jun 11, 2020, 10:37 PM IST

excise department caught 20 tonnes black jaggery in nagarkarnool district
20 టన్నుల నల్లబెల్లం పట్టివేత

నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేటలో అక్రమంగా రవాణా చేస్తున్న దాదాపు 20 టన్నుల నల్లబెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్​కు చెందిన లారీలో నల్లబెల్లంను హైదరాబాద్ నుంచి నేరుగా రవాణా చేసి అచ్చంపేట పరిసరాల్లో స్ధానిక వ్యాపారులకు కార్లు, క్రూజర్లలో నింపి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ అనంతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు.

పోలీసులు లారీ, ఒక క్రూజర్, మూడు కార్లను సీజ్ చేశారు. బెల్లం రవాణాకు సంబoధం ఉన్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అధికారులు వాహనాలను రాత్రి పట్టుకున్నా.. విషయాన్ని బయటకు రానివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవీ చూడండి: వేట కొడవళ్లతో వెంటాడి.. నడి రోడ్డుపై నరికేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.