నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి సోమశిల వరకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాదయాత్ర చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ... నల్లమల అడవిలో 10 కిలోమీటర్లు అనుచరులతో కలిసి ఉత్సాహంగా నడిచారు. సప్తనదుల సంగమ క్షేత్రం వద్ద పుణ్యస్నానాలు చేశారు. కార్యకర్తలతో కలిసి కృష్ణానదిలో ఈత కొడుతూ అలరించారు. అనంతరం కార్తిక పౌర్ణమి సందర్భంగా లలిత సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి, శివలింగానికి అభిషేకం నిర్వహించారు.
ఇవీ చూడండి: కొడవలితో మహిళ హల్‌చల్.. పింఛన్ కోసం బెదిరింపు