నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవి భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రతీ ఒక్కరి హక్కు అని... అందరూ ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు తెలిపారు.
ఓటు వేయకపోతే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతామని... నాయకులను నిలదీసి అడగాలంటే కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. పవిత్రమైన ఓటును బీరు, బిర్యానీ, మద్యం, డబ్బుకి అమ్ముకోవద్దని చెప్పారు. దేశ భవితవ్యం యువత చేతుల్లోనే ఉందని కళాశాల ఉపాధ్యాయులు గుర్తు చేశారు. ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో మేము భాగస్వాములమవ్వడం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పోలీస్ స్టేషన్లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం