నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికల్లో పాల్గొనే వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రచారాలు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్ల వివరాలను తెలుసుకొని పోలింగ్ తేదీ నాడు వారిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు.. ప్రతిపక్ష నేతలు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలో నిలబడిన అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
అన్ని ప్రాంతాల్లో తెరాస పార్టీ జోరుగా ప్రచారం సాగిస్తుండగా కొల్లాపూర్లో మాత్రం అందుకు భిన్నంగా సాగుతుంది. కొల్లాపూర్ మున్సిపాలిటి ఎన్నికల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన కుడికిల్ల గ్రామ రైతులు అధికార తెరాస పార్టీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డిని నమ్మి తాము మోసపోయామని ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి:క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం