నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ శర్మన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కరోనా టెస్టుల విభాగం, వార్డులు, ఐసోలేషన్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆక్సిజన్ సిలిండర్ నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో వైద్యులతో కలిసి స్వయంగా పరిశీలించారు. కొవిడ్ రోగులకు అందుతున్న సేవలు, పరీక్షల నిర్వహణ తీరు పరిశీలిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందిని ఉపనియామకం చేసుకోవాలని వైద్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: సికింద్రాబాద్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం