మహబూబాబాద్ జిల్లాలో కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని... నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆయన మృతికి సంతాపంగా పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేటలో అమరవీరుల స్థూపం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో నాడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, నేడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
ఉద్యమం పేరుతో విద్యార్థులను రెచ్చగొట్టి వారి బలిదానాల మీద కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందని దుయ్యబట్టారు. బోడ సునీల్ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరాశతో నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని... బతికి ఉండి కేసీఆర్పై పోరాడదామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వంద కోసం వివాదం.. యువకుడి ప్రాణం తీసిన ఘర్షణ