నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్ జితేందర్ రెడ్డి.. గ్రామానికి సంబంధించిన రూ. 17.53 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని గ్రామస్థులు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గ్రామ సర్పంచ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిధుల దుర్వినియోగం విషయంపై గతంలో జిల్లా పంచాయతీ శాఖ అధికారికి కూడా విన్నవించామని ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు తెలిపారు. వెంటనే సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని.. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారిస్తున్నారని గ్రామ ఇంఛార్జ్ సంతోష్ వివరించారు.
ఇదీ చదవండిః తమ సభ్యుడ్ని కిడ్నాప్ చేశారని రోడ్డెక్కిన గంగపుత్రులు